యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య లీడ్ రోల్‌లో రాబోతున్న సినిమా ‘సీతా పయనం’. కన్నడ స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ హీరోగా నటించగా, అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా, తాజాగా ‘పయనమే’ అంటూ సాగే ప్రేమ పాటను విడుదల చేశారు మేకర్స్.
అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయడంతోపాటు సత్య ప్రకాష్‌తో కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించారు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.
