ముక్కిన బియ్యం తిని 55 గొర్లు మృతి...రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

ముక్కిన బియ్యం తిని 55 గొర్లు మృతి...రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
  •     మరో 60 గొర్లకు అస్వస్థత 

 వేములవాడరూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారబోసిన ముక్కిన బియ్యాన్ని తిని 55 గొర్లు చనిపోయాయి. మరో 60 గొర్లు అస్వస్థకు గురైన ఘటన వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, చందుర్తి మండలం మూడపల్లి గ్రామాల సరిహద్దులో జరిగింది. 

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్ర్యాల, గంభీర్ పూర్ గ్రామాలకు చెందిన గొర్ల కాపరులు మేత కోసం మందను తోలుకుని వారం కింద మూడపల్లి శివారులోని రైతు చేనులో ఉంచారు. గురువారం గొర్లను పంట చేనులో మేపుతున్నారు.  

కాగా.. గ్రామ శివారులోని రైస్ మిల్ లో ముక్కిపోయిన బియ్యాన్ని బయట పారబోయగా వాటిని తిన్నాయి. తాండ్ర్యాలకు చెందిన వంగ రాజమల్లుకు చెందిన 35 గొర్లు, గంభీర్ పూర్ కు చెందిన కేశవేణి మల్లేశం, వేల్పుల మహేశ్ కు చెందిన 20 గొర్లు చనిపోయాయి. మరో 55 గొర్లు అస్వస్థతకు గురైనట్టు బాధితులు వాపోయారు.