ప్రముఖ బ్యాండ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల.. సినీ నటుడు విష్ణు విశాల్ ను పెళ్లాడింది. ఇవాళ(గురువారం) మధ్యాహ్నం వీరి మ్యారేజ్ నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్ లోని మొయినాబాదులో జరిగిన పెళ్లికి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా కారణంగా ఎక్కువ మందిని పెళ్లికి ఆహ్వానించలేదు.
కొన్నేళ్లుగా జ్వాల, విష్ణు విశాల్ ప్రేమలో ఉన్నారు. గతేడాది సెప్టెంబరులో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది.
