ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్‌లోని పీవీఆర్ భవన్లో శుక్రవారం ఇండిపెండెంట్‌గా గెలిచిన డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామ సర్పంచ్ మూడు ప్రకాష్ , ఉప సర్పంచ్ భువన గంగాధర్, మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామ ఉప సర్పంచ్ అనురాధ, వార్డు మెంబర్లు పద్మ, ప్రవీణ్, లాస్య, సాయిలు కాంగ్రెస్ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.
వారికి వినయ్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అశోక్, కాంగ్రెస్ డొంకేశ్వర్ మండల ప్రెసిడెంట్ భూమేశ్‌రెడ్డి, నాయకులు పిర్య నాయక్, లిఫ్ట్ చైర్మన్లు భోజ రెడ్డి, సుదర్శన్, వెంకటరమణ, స్రవంతి, సురేశ్, గార్డెన్ రాజు పాల్గొన్నారు.
