V6 News

నకిలీ నంబర్ ప్లేట్.. ఇద్దరు అరెస్ట్

నకిలీ నంబర్ ప్లేట్.. ఇద్దరు అరెస్ట్

కాచిగూడ, వెలుగు: నకిలీ నంబర్ ప్లేట్​ను ఉపయోగిస్తూ ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన ఇద్దరిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. రామంతాపూర్​కు చెందిన షేక్ అబ్బు బాబా, షేక్ రిహాన్ తమ హీరో గ్లామర్ బైక్ అసలు నంబర్​ను మార్చి, మరొక వాహనానికి చెందిన నంబర్ అమర్చారు. దీంతో చలానాలన్నీ కూకట్​పల్లికి చెందిన అసలు వాహన యజమాని ఎ. లక్ష్మి పేరిట నమోదవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను బుధవారం పట్టుకుని, కేసు నమోదు చేశారు.