కుట్టు శిక్షణ పూర్తైనవారికి సర్టిఫికెట్ల పంపిణీ

కుట్టు శిక్షణ పూర్తైనవారికి సర్టిఫికెట్ల పంపిణీ

కామారెడ్డిటౌన్​, వెలుగు : మహిళలు సాధికారికత సాధించాలంటే ఆర్థికంగా ఎదగాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​సంగ్వాన్​ పేర్కొన్నారు.  సోమవారం  జిల్లా మహిళా సాధికారిత కేంద్రం, సోనియా శంకర్​ ఫౌండేషన్​  ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ లో పాల్గొన్న మహిళలకు కలెక్టర్​ సర్టిఫికెట్లు అందించారు.  స్కిల్​ డెవలప్​మెంట్​ కోసం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలన్నారు.   జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.  

పర్యావరణ పోటీ పోస్టర్ల అవిష్కరణ

నేషనల్ స్టూడెంట్స్​ పర్యావరణ పోటీ ( ఎన్ఎస్​పీసీ) పోస్టర్లను సోమవారం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అవిష్కరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు.  నీటి సంరక్షణ, వ్యర్థాలను వేరు చేయడం వంటి పద్ధతులను విద్యార్థులకు అలవాటు చేయాలన్నారు.  హరిత్​, దవే ఆప్​ లైఫ్ అనే నినాదాంతో పర్యావరణ సంరక్షణపై ఆగస్టు  21 వరకు ఆన్​లైన్​లో ఎంట్రీ చేసుకోవచ్చని, 5 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. అడిషనల్  కలెక్టర్లు విక్టర్, చందర్​నాయక్,  డీఈవో రాజు, సైన్స్ అధికారి సిద్దారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కలెక్టర్​ను కలిసిన ఎల్లారెడ్డి ఆర్డీవో 

ఇటీవల ఎల్లారెడ్డి ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన పార్థసింహారెడ్డి సోమవారం కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో  వచ్చిన అప్లికేషన్ల పరిష్కారంపై ఫోకస్​ చేయాలని ఆర్డీవోకు కలెక్టర్ సూచించారు.