అవినీతిపై సహించే ప్రసక్తే లేదు  : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి 

అవినీతిపై సహించే ప్రసక్తే లేదు  : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి 
  • కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి 

కామారెడ్డిటౌన్​, వెలుగు : కామారెడ్డిలో అవినీతిని సహించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ మీటింగ్​కు ఆయన బీజేపీ తరఫున గెలిచిన 16 మంది కౌన్సిలర్లను వెంట బెట్టుకొని వచ్చారు. చైర్​పర్సన్​ ఎన్నిక తర్వాత మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు.  మున్సిపల్ ఎన్నికల ప్రచార మీటింగ్​ల్లో తాను ముందే  లోపాయి కారి ఒప్పందాలపై చెప్పానన్నారు. అదే విధంగా ఇప్పుడు జరిగిందన్నారు.  కాంగ్రెస్​, బీఆర్ఎస్ ఒప్పందాలు చేసుకున్నాయన్నారు.

కాంగ్రెస్, బీఆర్​ఎస్​ అవగాహనను ప్రజలు గమనిస్తున్నారన్నారు.  అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ, అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టారాజ్యంగా అధికారులు సంతకాలు చేస్తే సస్పెండ్ చేయిస్తామన్నారు.  తమకు మున్సిపాలిటీలో 16 స్థానాల్లో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.