కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో కందుల కొనుగోలుకు 11 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ శశిధర్‌రెడ్డి బుధవారం తెలిపారు. బిచ్కుంద మార్కెట్ యార్డు, బిచ్కుంద మండలం పుల్కల్, మద్నూర్ మార్కెట్ యార్డు, డొంగ్లీ సొసైటీ, పిట్లం మార్కెట్ యార్డు, గాంధారి మార్కెట్ యార్డు, సదాశివనగర్ మండలం ఉత్నూర్ సొసైటీ, పద్మాజీవాడి సొసైటీ, జుక్కల్ మార్కెట్ యార్డు, రాజంపేట మండలం ఆర్గొండ సొసైటీ, దోమకొండ సొసైటీల్లో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కందులకు తేమ శాతం 12 ఉండేలా చూసుకోవాలన్నారు. సెంటర్లలో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8వేలుగా నిర్ణయించామని తెలిపారు.
