కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న లవ్ మాక్‌టెయిల్ సిరీస్‌కు ముగింపు భాగంగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ మాక్‌టెయిల్ 3’. హీరో డార్లింగ్ కృష్ణ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను భావోద్వేగాలకు గురి చేస్తూ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఆడియన్స్ ఎమోషన్ అయ్యేలా చేస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ చిత్రం, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.
ನಿಮ್ಮೆಲ್ಲರ ಫೇವರಿಟ್, ಡಾರ್ಲಿಂಗ್ ಕೃಷ್ಣ ಅವರ ‘ಲವ್ ಮಾಕ್ಟೇಲ್ 3’ ನಿಮ್ಮ Z5 ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ಟ್ರೀಮಿಂಗ್ ಆಗ್ತಿದೆ. ಅಪ್ಪ-ಮಗಳ ಈ ಸೂಪರ್ ಕಥೆನ ಈಗಲೇ ವೀಕ್ಷಿಸಿ.#LoveMocktail3OnZEE5 #LoveMocktail3 #KannadaZEE5 pic.twitter.com/mfbqISanAd
— ZEE5 Kannada (@ZEE5Kannada) May 10, 2026
కథేంటంటే:
ఆది (డార్లింగ్ కృష్ణ) తన భార్య (మిలానా నాగరాజ్) చనిపోయిన తర్వాత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. అనాథాశ్రమం నుంచి చిన్నారి నిధి (బేబీ సంవృత)ని దత్తత తీసుకుని తండ్రి అవుతాడు. అతనికి కూతురే ప్రపంచం. తండ్రి, కూతురు మధ్య ఏర్పడిన అపూర్వమైన బంధం, క్షణికమైన ఆనందాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అంతా సంతోషంగా ఉన్న టైంలో నిధి గతానికి సంబంధించిన కొన్ని రహస్యాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? నిధికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటి నుంచి కాపాడుకోవడానికి ఆది ఏం చేశాడు? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే
ఎలా ఉందంటే?
ఈ సినిమా ప్రధాన బలం ఎమోషన్స్. ముఖ్యంగా తండ్రి-కూతుళ్ల మధ్య బంధాన్ని దర్శకుడు ఎంతో సహజంగా చూపించారు. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. డార్లింగ్ కృష్ణ తన నటనతో మరోసారి ఆకట్టుకోగా, బేబీ సంవృత కూడా భావోద్వేగ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. సినిమాలో డ్రామా, ఎమోషన్స్‌తో పాటు లైట్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కథకు మరింత బలం చేకూర్చాయి. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగిన ఫీలింగ్ వచ్చినా, క్లైమాక్స్ మాత్రం హృదయాన్ని తాకుతుంది. ఫైనల్‌గా.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు, హార్ట్‌టచింగ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ‘లవ్ మాక్‌టెయిల్ 3’ మంచి ఛాయిస్.
