Mirai: ‘హనుమాన్’ సక్సెస్‌‌‌‌‌‌‌‌తో భారీ క్రేజ్.. కరణ్ జోహార్ చేతికి తేజ సజ్జా ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’

Mirai: ‘హనుమాన్’ సక్సెస్‌‌‌‌‌‌‌‌తో భారీ క్రేజ్.. కరణ్ జోహార్ చేతికి తేజ సజ్జా ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’

‘హనుమాన్’ సక్సెస్‌‌‌‌‌‌‌‌తో పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూపర్ యోధగా అలరించనున్నాడు. రితికా నాయక్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్. మనోజ్ మంచు విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జగపతిబాబు, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ  విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న 2డి, 3డి ఫార్మాట్స్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. తాజాగా బాలీవుడ్ లీడింగ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు.

తన బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ‘మిరాయ్’హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. దీంతో నార్త్‌‌‌‌‌‌‌‌లో మ్యాసివ్ రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ కొలాబరేషన్‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమాపై మరింత ఎక్సయిట్మెంట్ పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆసక్తిని పెంచాయి.