కర్నాటక మాజీ సీఎం కుమారస్వామికి కరోనా

కర్నాటక మాజీ సీఎం కుమారస్వామికి కరోనా

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కరోనా సోకింది. శనివారం కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వరా వెల్లడించారు. ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా నిర్ధారణ అయిన కొద్ది గంట్లోనే మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ నేత అయిన కుమారస్వామి కూడా కరోనా బారిన పడడం గమనార్హం. కర్నాటకలో ఇప్పటికే కేసులు విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో ప్రముఖులంతా ఒకరి తర్వాత మరొకరు అన్నట్లు కరోనా బారిన పడుతున్నారు. తనకు కరోనా సోకినందున గత కొన్ని రోజులుగా తనను కలసిన వారు.. తనతో సన్నిహితంగా తిరిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కరోనా నెగటివ్ అని నిర్ధారించినా ముందు జాగ్రత్తగా హోం ఐసొలేషన్ లో ఉంటూ.. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. తాను కూడా హోం ఐసొలేషన్ కే పరిమితం అవుతున్నానని ఆయన పేర్కొన్నారు. అందరూ అత్యవసరం అయితే తప్ప బయట తిరగొద్దని, సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్కులు విధింగా ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.