
- ధాన్యం సేకరణ అంశంలో కేసీఆర్ రోజుకో కొత్త నాటకం
- వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్.. ఫాంహౌస్ లొ వరిపంట ఎందుకు..?
పార్లమెంట్ ఎన్నికలతో పాటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మన్. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఐదారు నెలలు మాత్రమే సమయముందని తెలిపారు. దారూసలాంకు టీఆర్ఎస్ పార్టీ పెంపుడు కుక్క అని.. దేశంలో జమిలీ ఎన్నికలు జరగాలని బీజేపీ కోరుకుంటుందన్నారు. ముందస్తుకు వెళ్ళటానికి కేసీఆర్ కు అర్హత లేదని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాల్సింది ఎన్నికల కమిషన్ అని..ఎస్టీ రిజర్వేషన్ల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ దూరమని.. 12శాతం ముస్లిం రిజర్వేషన్లు అర్థరహితమన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బహిర్గతం చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని..ధాన్యం సేకరణ అంశంలో కేసీఆర్ రోజుకో కొత్త నాటకానికి తెరతీస్తున్నారన్నారు. వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్.. ఫాంహౌస్ లొ వరిపంట ఎందుకు వేశారో చెప్పాలన్నారు. తెలంగాణ రైతుల ఇబ్బందులకు కారణం కేసీఆర్ అని..నిజాం ఫైల్స్ సినిమా తీయాలని సినీ నిర్మాతలను కోరుకుంటున్నానని తెలిపారు లక్ష్మన్.