రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

V6 Velugu Posted on Oct 14, 2021

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా ఒక  ప్రత్యేకమైన వేడుక అని ఆయన పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదనే స్ఫూర్తితో, చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని కేసీఆర్ తెలిపారు. ఆయురారోగ్యాలు సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను  దసరా సందర్భంగా సీఎం కేసిఆర్  ప్రార్థించారు.
 

Tagged Telangana, CM KCR, people, KCR, Wishes, Dussehra, vijayadashami

Latest Videos

Subscribe Now

More News