కేసీఆర్ దళిత బంధు కాదు..రాబందు

కేసీఆర్ దళిత బంధు కాదు..రాబందు

ఇంద్రవెల్లి సభ సక్సెస్ తో TRS కు చురుకు తగిలిందన్నారు AICC అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఏడేళ్లలో  ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన 65 వేల కోట్లు ఖర్చు చేయలేదన్నారు.ఆ నిధులు ఖర్చు చేస్తే దళిత బంధు అవసరం లేదన్నారు. కేసీఆర్ దళిత బంధు కాదు.. రాబందువు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యాసంస్థల్లో టీచర్ల కొరత ఉందన్నారు దాసోజు శ్రవణ్. మంత్రి కేటీఆర్ తో పాటు TRS నాయకులు తమ పిల్లలను టీచర్ల కొరత ఉన్న విద్యాసంస్థల్లో చదివిస్తారా..? అని ప్రశ్నించారు. కూట్లే రాయి తీరనోడు ఏట్ల రాయి తీస్తాడా అని అన్నారు. ఆట, యుద్ధం మొదలైందని.. TRS ప్రభుత్వాన్ని వదిలిబెట్టబోమన్నారు. చావడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు పోరాడుతామన్నారు దాసోజు. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయంతో ఆలస్యం చేయడానికి కరోనాను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

రేపటి నుంచి సమన్వయ కర్తలు గ్రామాలకు వెళ్తారని..కేసీఆర్ మోసాలను, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చాటి చెబుతారన్నారు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతి ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డప్పు చాటింపు చేపడుతామన్నారు. హుజురాబాద్ ఇచ్చినట్లుగానే రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.