వాతావరణ అప్‌డేట్: వచ్చే 48 గంటల్లో రుతుపవనాలు

వాతావరణ అప్‌డేట్: వచ్చే 48 గంటల్లో రుతుపవనాలు

మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు మాన్‌సూన్‌ విస్తరించనుందని తెలిపింది. తీవ్ర తుఫానుగా మారిన బిపార్జోయ్ తుఫాను వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2023 జూన్ 4న రుతుపవనాలు వస్తాయని మేలో ఐఎండీ అంచనా వేసింది. కానీ ఇది కాస్త ఆలస్యమైంది.

" దక్షిణ అరేబియా సముద్రం మీదుగా గాలులు వీస్తున్నాయి. అవి క్రమంగా బలపడుతున్నాయి. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవన్నీ రుతుపవనాల రాకకు అనుకూలిస్తాయి. మరో ఒకటి రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది " అని పేర్కొంది.

తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో జూన్ 9 వరకు, కేరళలో జూన్ 11 వరకు కొనసాగుతుందని, జూన్ 9-11 వరకు లక్షదీప్, జూన్ 10, 11 తేదీల్లో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ  పేర్కొంది.

కేరళ, తమిళనాడు, లక్షదీప్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా చెల్లాచెదురుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ  తెలిపింది.