ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని వీడీవోఎస్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు వ్యవసాయ సహకార చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా లాప్ టాప్ లు పంపిణీ చేశారు.
మున్నేరు వరదల సమయంలో చేతన ఫౌండేషన్ సేవలు మరువలేనివని మంత్రి తుమ్మల అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ నీరజ, చేతన ఫౌండేషన్ ప్రెసిడెంట్ వెనిగళ్ల రవికుమార్, సభ్యులు వెనిగళ్ల అనిల్ కుమార్, దొడ్డ సీతారామయ్య, ముత్తినేని సురేశ్, చంద్రకాని నవీన్, షేక్ రషీద్ పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు పంపిణీ
మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం రోటరీక్లబ్ సహకారంతో 250 మంది మున్నేరు వరద బాధితులు దడవాయి, ఆటో డ్రైవర్స్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరావు, విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర మేయర్ నీరజ, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.