మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, మాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. పట్టు చీరలు, వెడ్డింగ్ శారీస్, వింటేజ్ కలెక్షన్స్‌ను పరిశీలించి డిజైన్లు బాగున్నాయని, ధరలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెదక్ లో కిసాన్ షాపింగ్ మాల్ ఏర్పాటు కావడంతో పట్టణంతోపాటు పరిసర ప్రాంత వాసులు షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లే ఇబ్బంది తప్పిందన్నారు.
షాపింగ్మాల్ఓనర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. 66 ఏండ్లుగా తమ కుటుంబం వస్త్ర వ్యాపారం చేస్తోందన్నారు. తమ మాల్ లో అన్ని వయసుల వారికి అవసరమైన అన్ని రకాల వస్త్రాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాంకర్ అనసూయను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు పాటలకు ఆమె స్టెప్పులు వేసి అలరించారు.

