కొడంగల్, వెలుగు: వికారాబాద్జిల్లాలోని కొడంగల్సబ్ట్రెజరీ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట దాటినా ఏస్టీవో, ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో ఖాళీ కూర్చీలు దర్శనమిచ్చాయి. తమకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చన్న ధీమాతో ఉద్యోగులు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
