ఆసుపత్రిలో చేరిన అనిల్-ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

ఆసుపత్రిలో చేరిన అనిల్-ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

Kokilaben Ambani: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీల తల్లి కోకిలాబెన్ అంబానీ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను అత్యవసరంగా ఎయిర్ అంబులెన్స్ సాయంతో ముంబైలోని హెచ్ఎల్ రిలయన్స్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. 91 ఏళ్ల కోకిలాబెన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. 

కొద్దిగా నలతగా అనిపించటంతో కోకిలాబెన్ అంబానీని వెంటనే ఆమె కుటుంబం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతుండగా నిరంతరం ప్రత్యేక వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా అంబానీ ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కోకిలాబెన్ అంబానీ పెద్ద కుమారుడు ముఖేష్ తో కలిసి ఆంటీలియాలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీతో ఆమె వివాహం 1955లో జరిగింది. ప్రస్తుతం ఆమెకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలో రూ.18వేల కోట్లు విలువైన షేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. భర్త మరణం తర్వాత ఇద్దరు కుమారులకు సంపదను పంచటంలో కోకిలాబెన్ కీలకపాత్ర పోషించారు. శాఖాహారి అయిన కోకిలాబెన్ శ్రీనాథ్జీ భక్తురాలు. అందుకే ఆమె తరచుగా జామ్‌నగర్ లోని ద్వారకాధీష్ ఆలయంతో పాటు రాజస్థాన్ లోని నాథ్‌ద్వారాను సందర్శిస్తుంటారు. 

ALSO READ : భారత్‌లో ఐఫోన్ల తయారీపై చైనా కుట్ర

కోకిలాబెన్ 1934లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించారు. కోకిలాబెన్ 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమెకు పప్పు, రోటీ మరియు ధోక్లా వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలు చాలా ఇష్టం. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీలకు ముఖేష్, అనిల్, నినా కొఠారి, దీప్తి సల్గావ్కర్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు.