కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో రెండ్రోజులపాటు అంతరాలయ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి బుధవారం తెలిపారు.
గర్భగుడిలో కొన్ని రిపేర్లు చేపడుతున్నామని, ఈనెల 21, 22 తేదీల్లో అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి శనివారం యథావిధిగా దర్శనాలను కొనసాగిస్తామన్నారు.
