హైదరాబాద్​లో .. కళాకారులకు గద్దర్​ ఐకాన్ ​అవార్డు

హైదరాబాద్​లో .. కళాకారులకు గద్దర్​ ఐకాన్ ​అవార్డు

జన్నారం/కోల్​బెల్ట్, వెలుగు: జన్నారం మండలం చింతగూడకు చెందిన కళాకారుడు కొండుకూరి రాజు, మందమర్రి పట్టణానికి చెందిన కళాకారుడు, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు అంతడుపుల నాగరాజుకు గద్దర్ ఐకాన్ అవార్డు దక్కింది. అలేఖ్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జానపద కళాకారులకు ప్రదానం చేసే అవార్డులో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్​లోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు. 

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, గద్దర్ కూతురు, సాంస్కృతిక సారథి చైర్​పర్సన్​ వెన్నెల గద్దర్, తెలంగాణ ఉద్యమ నేత, కవి, గాయకుడు దరువు అంజన్న చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకున్నారు.