కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీకి బదలాయింపు

V6 Velugu Posted on Apr 05, 2021

అమరావతి: కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్‌కు బదిలీ అయింది. విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ కృష్ణపట్నం పోర్టులో తన పెట్టుబడుల్ని వంద శాతానికి పెంచుకుంది. ఈ 25 శాతం వాటా విలువ రూ.2, 800 కోట్లుగా పేర్కొన్న అదానీ గ్రూప్ వాటాల కొనుగోలుపై ప్రకటన విడుదల చేసింది. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం మొత్తం అదానీ పోర్ట్స్‌కు బదలాయించుకునే క్రమంలో 2020లో 75 శాతం వాటా కొనుగోలు చేసి దూకుడు ప్రదర్శించింది అదానీ పోర్ట్స్. మొత్తం వాటా కోసం మిగిలిన 25 శాతం వాటా కూడా ఇప్పుడు కొనేసింది. 2020-21లో కృష్ణపట్నం పోర్టు విలువ రూ.13,675 కోట్లు అని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. 

Tagged VIjayawada, Andhra Pradesh, krishnapatnam port, adani group

Latest Videos

Subscribe Now

More News