ఒకేనెలలో 3 సినిమాలు: తెలుగులో ఫెయిల్ అయిన.. తమిళంలో కృతి శెట్టికి వరుస ఆఫర్లు..

ఒకేనెలలో 3 సినిమాలు: తెలుగులో ఫెయిల్ అయిన.. తమిళంలో కృతి శెట్టికి వరుస ఆఫర్లు..

తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్‌‌ బస్టర్‌‌‌‌ హిట్ అందుకున్న కృతిశెట్టి... యూత్‌‌ ఆడియెన్స్‌‌లో సూపర్ ఫ్యాన్‌‌ బేస్‌‌ క్రియేట్ చేసుకుంది.  ఆ తర్వాత కూడా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో ఇంప్రెస్‌‌ చేసిన కృతిశెట్టికి ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి.

కస్టడీ, మనమే, ది వారియర్, మాచెర్ల నియోజకవర్గం చిత్రాలు నిరాశ పరచడడంతో ఇక కోలీవుడ్‌‌పై దృష్టి సారించిన కృతి.. అక్కడ వరుస అవకాశాలు అందుకుంది. ఇప్పటికే షూటింగ్స్‌‌ పూర్తయిన ఆ సినిమాలన్నీ రరకరకాల కారణాలతో ఆలస్యమవుతూ వచ్చాయి.  ఫైనల్‌‌గా ఒకే నెలలో రిలీజ్‌‌కు రెడీ అయ్యాయి.

వాటిలో ముందుగా చెప్పుకోవాల్సి చిత్రం కార్తి హీరోగా వస్తున్న ‘వా వాతియార్‌‌‌‌’. నలన్ కుమారస్వామి దీనికి దర్శకుడు. డిసెంబర్‌‌‌‌ 5న విడుదల కాబోతోంది. అలాగే ప్రదీప్‌‌ రంగనాథన్‌‌కు జంటగా ఆమె నటించిన ‘లవ్‌‌ ఇన్సూరెన్స్‌‌ కంపెనీ’ చిత్రం డిసెంబర్‌‌‌‌ 18న రాబోతోంది.

ఇక రవి మోహన్‌‌కు జంటగా కళ్యాణీ ప్రియదర్శన్‌‌తో కలిసి కృతిశెట్టి నటించిన  ‘జీనీ’ చిత్రం కూడా డిసెంబర్‌‌‌‌లోనే వస్తోంది. మరి బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలతో డిసెంబర్‌‌‌‌లో ప్రేక్షకులకు ముందుకొస్తున్న కృతికి... గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్‌‌ లభిస్తుందేమో చూడాలి!