ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 66 శాతం మంది ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో ఉంటే ఎన్నికలకు రావాలి: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • స్పీకర్ ముందు కడియం, పోచారం పచ్చి అబద్ధాలు చెబుతున్నరని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ‘‘పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. అలాగైతే, పార్టీ ఫిరాయించిన ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు రావాలి”అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. శుక్రవారం సిరిసిల్లలో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఎన్నికలకు వెళ్తే ఎవరితో ఎంత మంది ఉన్నారో.. ఎవరి బతుకు ఏంటో తేలిపోతుందన్నారు.

 రేవంత్ రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. 66 శాతం పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పిన సీఎం.. ఐదు నిమిషాలకే మాట మార్చారన్నారు. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి తప్పించుకున్నారని మండిపడ్డారు. గతంలో మంత్రిగా, స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు గడ్డిపోచ లాంటి పదవుల కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. 

బయట కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరామని ప్రగల్భాలు పలికిన ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో తాము బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాల్సిన స్పీకర్ కూడా తామిచ్చిన ఆధారాలు పక్కనబెట్టి సీఎం ఒత్తిడితో అబద్ధాలు చెప్పాల్సి వస్తోందన్నారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ప్రజలే బుద్ధి చెప్పారు..

రైతులను, మహిళలను, బీసీలను మోసం చేసినందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ అన్నారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారన్నారు. సిరిసిల్లలో 117 పంచాయతీలకు గాను 80 చోట్ల బీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. పల్లెలు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారని పేర్కొన్నారు. గెలిచిన వారు, ఓడిపోయిన వారితో కలిసి పనిచేయాలని సూచించారు.

 వచ్చే సంవత్సరంలో కొత్తగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకొని, పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రాబోయే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.