20 డిసెంబర్ హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసనలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

20 డిసెంబర్ హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసనలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం లో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్​లో కాంగ్రెస్ నిరస న కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే.. ఆదివా రం అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో పార్టీ కేడర్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు. వీటిని సక్సెస్ చేసేందుకు ఈ నిరసనలో ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొనాలని కోరారు. శనివారం సికింద్రాబాద్ లోని పారడైజ్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.