గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే వంశీకృష్ణ

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. కొత్తగా ఎన్నికైన నియోజకవర్గంలోని సర్పంచులు, ఉప సర్పంచులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. 

గ్రామాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించారు.