మద్దూరు, వెలుగు: బీజీఏ థియేటర్ అసోసియేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రొడక్షన్ ఓరియెంటెడ్ ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వర్క్‌షాప్ రెండు నెలలు పూర్తి చేసుకున్నట్లు ట్రైనర్ బుగ్గప్ప తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణివెట్లలో మునిరంగ స్వామి బయలు నాటకం 4 నెలల వర్క్ షాప్ కొనసాగుతోంది.
మహా విష్ణు అంశతో పుట్టి దుష్ట శిక్షణ చేసిన మునిరంగ స్వామి నాటకం మొదట్లోనే పల్లెల జీవన శైలిని ప్రభావితం చేసిందని తెలిపారు. బయలు నాటకాలు భారత దేశ సంప్రదాయం, సంస్కృతిని తెలియజేస్తాయని, ఇలాంటి కళలను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు.
