నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కోసం జిల్లా క్రికెట్ టీమ్‌ను ఎంపిక చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్ సీఏ) మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజశేఖర్ తెలిపారు. పట్టణంలోని క్రికెట్ గ్రౌండ్ లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 26వ వరకు 4 లీగ్ మ్యాచ్ లు ఆడతారని, ప్రతిభ చూపిన వారిని ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేస్తామని తెలిపారు.
జిల్లాస్థాయి క్రీడా పోటీలకు 16 మందిని ఎంపిక చేశామని చెప్పారు. ఎం రాంచరణ్, ఎన్ గగన్, జె జస్వంత్, వివేక్, అర్షద్ అహ్మద్, ఎన్ సాత్విక్ రెడ్డి, ఎం క్యాతేశ్వర్, పి సుబ్రత్ కౌశిక్, ఆర్ చరణ్, మహమ్మద్ ముజ్తబా, పి అభిరామ్, అంజి, ఎన్ జస్వంత్, మహమ్మద్ షాహిద్ అఫ్రిది, బి సంజయ్, శామ్యూల్ జోసెఫ్ ఎంపికయ్యారు. మహమ్మద్ మన్నాన్, సతీశ్ పాల్గొన్నారు.
