మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మెడిసిన్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున్, శోభన్ యాదవ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, కిల్లే గోపాల్ మాట్లాడుతూ దేశంలో మెడిసిన్స్ రేట్లు విపరీతంగాపెరగడంతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల దోపిడీని అరికట్టాలని, మెడికల్ సేల్స్ ప్రమోషన్ యాక్ట్ ను పునరుద్ధరించి, మెడికల్ రిప్రజెంటేటివ్‌ల కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
మేనేజ్మెంట్ ఒత్తిడితో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మందుల కంపెనీలను నియంత్రించాలని, ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె హక్కును కొనసాగించాలని కోరారు. అనంతరం లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. విష్ణువర్ధన్, రమేశ్, ఖమర్ అలీ, రమణ, రాజ్ కుమార్, రమణారెడ్డి పాల్గొన్నారు.
