
షావోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మీ ఇండియా మార్కెట్లోకి రెడ్‌మీ బుక్ ప్రొ, రెడ్‌మీ బుక్ ఈ-లెర్నింగ్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. రెడ్‌మీ బుక్ ప్రొలో 15.60 ఇంచుల స్క్రీన్, ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, విండోస్ 10 ఓఎస్ ఉంటాయి. ధర రూ.50 వేలు. రెడ్‌మీ బుక్ ప్రొ ఈ-లెర్నింగ్‌లో 15.60 ఇంచుల స్క్రీన్, ఐ3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, విండోస్ 10 ఓఎస్ ఉంటాయి. ధర రూ.42 వేలు.