
తెలంగాణలో వైన్ షాపుల లైసెన్స్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 31తో ముగియనున్న లైసెన్స్ గడువును నవంబర్ 30 వరకు పెంచింది. రాష్ట్రంలో 2,200కు పైగా వైన్‌షాపులు ఉండగా.. వాటి లైసెన్స్ గడువు అక్టోబర్ 31తో ముగియనుంది. కరోనా కారణంగా తమకు నష్టం వాటిల్లిందని, ఇందుకు పరిహారంగా గడువు పొడిగించాలని వైన్‌షాప్ యాజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో లెసెన్స్ గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్జిన్ శాతాన్ని కూడా 6.4 నుంచి 10 శాతానికి పెంచింది. బార్ల యజమానులు ఈ నెల 30లోగా మొదటి త్రైమాసిక లైసెన్స్ ఫీజును చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.