సౌలతులు లేని బడులు

సౌలతులు లేని బడులు

రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం బతుకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మారుతాయి అని ఆశించాం. విద్య బాగా మెరుగుపడుతుందనుకున్నాం. కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పక తప్పదు. విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూడీఐఎస్ఏ 2021--– 22  పాఠశాలలకు సంబంధించిన నివేదికల్లో  దేశ వ్యా ప్తంగా బడికి పోయే విద్యా ర్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తేలింది. తెలంగాణ రాష్టం  మొత్తంలో ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలలు కలిపి సుమారు 43,083 ఉన్నా యి. అందులో మొత్తం 69,15,241 మంది విద్యా ర్థులు విద్యనభ్యసిస్తున్నా రు. వీటిల్లో  సుమారుగా 32,0894 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఒక పాఠశాలలో సగటున ఏడుగురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా లోతులోకివెళ్లి చూసే కేవలం తక్కువ బడుల్లోనే విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆటలు ఆడుకునే మైదానాలు ఉన్నా యి. కేవలం 772 బడుల్లో మాత్రమే డిజిటల్​ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. 

కనీస వసతుల కరువు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు డిజిటల్ వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నా యి  కానీ మన భావితరాలు రూపుదిద్దుకొనే బడుల్లో  కనీస వసతులు సమకూర్చడం లేదు. ఇది వారిని నేటి డిజిటల్ పోటీ ప్రపంచం నుంచి దూరం చేయడం కాదా? ఈ మాత్రం  వాస్తవాలు మన ప్రభుత్వ పెద్దలకు తెలియవా? విద్యార్థులకు కనీస అవసరం అయిన టాయిలెట్స్ కూడా సరిగా లేకపోవడం దారుణం.​ మన రాష్టంలో  33,428 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. సుమారుగా 10 వేల పాఠశాలల్లో  కనీస టాయిలెట్స్ లేవు.  ఇదే సమస్య బాలురులకూ ఉంది.  తాగునీరు అందుబాటులో లేని పాఠశాలలు 6 వేలకు పైగా ఉన్నాయి.  ప్రభుత్వం ఉచితంగా బుక్స్​,యూనిఫామ్​ ఇస్తున్నట్లు చెబుతున్నా.. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎక్కడా విద్యార్థులకు అందడం లేదు. ఈ ఏడాది అకడమిక్​  ఇయర్​ ప్రారంభమై ఇప్పటికే నెలలు గడిచినా.. ఇంకా పూర్తి స్థాయిలో బుక్స్​, యూనిఫామ్​ అందని బడులు రాష్ట్రంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం బడుల్లో వసతులు కల్పించేందుకు ప్రారంభించిన ‘మన ఊరు మన బడి’ని కి నిధుల కేటాయింపు పెంచి , దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఉంది. 

కరోనా సమయంలో నష్టం

కరోనా కారణంగా మన పిల్లలు ఆన్​లైన్ అనివార్య విద్యను అరకొర వసతుల మధ్యే సాగించారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారు మంచి వసతులతో డెస్క్​టాప్​, ల్యాప్​టాప్​, వైఫై, ట్యా బ్ లాంటి పరికరాల సాయంతో ఆన్​లైన్​ విద్యను పొందారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు మొబైల్ డేటా తో సరిపెట్టుకున్నారు.  కరోనా కాలంలో  ప్రధానంగా నష్టపోయింది మాత్రం అణగారిన గ్రామీణ, పట్టణ పేద విద్యార్థులే.  రేపటి తరానికి కావాల్సిన పాఠశాల విద్య వ్యవస్థకు అవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను మన రాష్టంలోని పాఠశాల్లో తీసుకురావాలి.- టాయిలెట్స్​, స్కూ ల్ లైబ్రరీలు, పిల్లలు ఆడుకోవడానికి మైదానాలు, సరిపడా టీచర్స్, స్కూ ల్ లో ఆన్​లైన్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యా లు నేర్పే పరికరాలు సమకూర్చాలి. లేదంటే తెలంగాణ విద్యా ర్థులు రేపటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోలేరు. కనీసం టాయిలెట్స్ , తాగునీరు, మైదానాల వసతులు పాఠశాల్లో కల్పించలేని మన ప్రభుత్వా లు ఏ విధంగా ప్రపంచస్థాయి అవార్డులు మన పిల్లలకు రావాలని ఆశపడగలవు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి. -

అశోక్ ధనావత్, ది హేగ్, నెదర్లాండ్స్