మధ్యప్రదేశ్‌లో ఈ నెల 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు

V6 Velugu Posted on May 06, 2021

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.ఈ క్రమంలో జనతా కర్ఫ్యూను ఈ నెల 15 వరకు పొడిగించాలని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నిర్ణయం తీసుకున్నారు. గురువారం వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ప్రకటన చేశారు. ఈ కర్ఫ్యూను కూడా కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఏప్రిల్‌ 21 వరకు కరోనా వ్యాప్తిలో ఏడవ స్థానంలో ఉండగా..మీ మద్దతుతోనే ఆ స్థానాన్ని 14కు చేర్చామని ప్రజలనుద్దేశించి చెప్పారు. కరోనాను అరికట్టడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 15 వరకు వివాహాలు, ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.

Tagged Madhya Pradesh, May 15, Janata COVID curfew  extended, CM Shivraj Singh Chouhan

Latest Videos

Subscribe Now

More News