
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అభిమానుల కోసం ముందుగా థియేటర్ లో రిలీజ్ చేశాక, ఆ తరువాత యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో మహేష్ ఊరా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరిపోయింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చే ఏడాది 2024 జనవరి 13న సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఇందులో మహేష్ సరసన పూజ హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.