ధనుష్కోడి బీచ్లో అద్భుత దృశ్యం

ధనుష్కోడి బీచ్లో అద్భుత దృశ్యం

 తమిళనాడు : రామేశ్వరం ధనుష్కోడి బీచ్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 150 తాబేలు పిల్లలు బుడిబుడి అడుగులేస్తూ సముద్రంలోకి వెళ్లాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చొరవతో ప్రాణం పోసుకున్న తాబేలు పిల్లలు తొలిసారి సముద్రంలోకి అడుగుపెట్టాయి. ఏటా ఈ సీజన్లో తాబేళ్లు బీచ్లోకి వచ్చి గుడ్లు పెడతాయి. అయితే టూరిస్టులు అనుకోకుండా తొక్కేయడం, జంతువులు తినేయడంతో గుడ్లు ధ్వంసమవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఫారెస్ట్ సిబ్బంది ఆ గుడ్లను సేకరించి ముకుందరాయర్ చతిరమ్ హేచరీలో పొదిగించారు. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలను సముద్రంలోకి వదిలారు. తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళ్తున్న దృశ్యం చూసి టూరిస్టుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.