జమ్మికుంట మార్కెట్ లో బ్రహ్మాజి మూవీ షూటింగ్కు నో పర్మిషన్

జమ్మికుంట మార్కెట్ లో బ్రహ్మాజి మూవీ షూటింగ్కు నో పర్మిషన్

కరీంనగర్ జిల్లా: ముందస్తు అనుమతి లేకుండా సినిమా షూటింగ్ కోసం వచ్చిన సినీ నటుడు బ్రహ్మాజీకి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో నిరాశ ఎదురైంది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకునేందుకు వచ్చిన యాక్టర్ బ్రహ్మాజీకి మార్కెటింగ్ శాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. 
దీంతో బ్రహ్మాజీ మార్కెట్ యార్డులో అటూ..ఇటు తిరిగి రైతులతో ముచ్చటించారు. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన పంట సరుకులను పరిశీలించారు. తమ మధ్యకు వచ్చిన యాక్టర్ బ్రహ్మాజీతో పలువురు రైతులు, కార్మికులు సెల్ఫీలు,  ఫోటోలు దిగారు.