అభివృద్ధిని తట్టుకోలేక బీఆర్ఎస్ విమర్శలు : కవ్వంపల్లి సత్యనారాయణ

అభివృద్ధిని తట్టుకోలేక బీఆర్ఎస్ విమర్శలు : కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్ సిటీ, వెలుగు:  కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. మంగళవారం పార్లమెంట్ నియోజకవర్గానికి సమన్వయకర్తలుగా నియమితులైన పీసీసీ ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్, ఆడం రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేకపతి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిన సందర్భంగా డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం రాష్ట్రంలో చేపట్టిన జైబాపు, జై భీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జై సంవిధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్  పాలనలో అభివృద్ధి పేరుతో అవినీతి సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. కుటిల రాజకీయలకు తెరలేపిన బీజేపీ పార్టీ కి ప్రజలు బుద్ధి చెబుతారు. సమావేశంలో లీడర్లు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, చాడగొండ బుచ్చిరెడ్డి,  ప్రసాద్, హర్ష మల్లేశం, యాదయ్య, మోహన్, కొరివి  అరుణ్ కుమార్, శ్రావణ్ నాయక్, వైద్యుల అంజన్ కుమార్, విలాస్ రెడ్డి, భూమా గౌడ్ పాల్గొన్నారు.