కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం : మంత్రి సీతక్క

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం : మంత్రి సీతక్క

నిజామాబాద్, వెలుగు: కార్యకర్తలే పార్టీకి బలమని  జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం నగరంలోని ఈవీఎం గార్డెన్​లో జరిగిన నిజామాబాద్​, జహీరాబాద్ పార్లమెంట్​ సెగ్మెంట్ల కాంగ్రెస్ శ్రేణుల మీటింగ్​లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. త్యాగాల పునాదులపై నిర్మితమైన కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడిగా ఉండడాన్ని ప్రతి కార్యకర్త గర్వంగా భావించాలన్నారు.  లోకల్​ బాడీ ఎలక్షన్​లో కాంగ్రెస్​ అభ్యర్థులు గెలిచేలా కలిసికట్టుగా పని చేద్దామని సూచించారు

గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్ మధ్య సమరం

ప్రధాని మోదీ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ అన్నారు. గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్, మోదీ మధ్య సమరం నడుస్తోందన్నారు. బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో చార్​ సౌ పార్​ అని చతికిలబడి పొత్తులతో లాక్కోస్తున్నారని ఎద్దేవా చేశారు.  ఈనెల 4న మల్లికార్జున ఖర్గే సభను సక్సెస్​ చేయాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. జహీరాబాద్​ ఎంపీ సురేష్ షెట్కర్​, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి, మదన్​మోహన్​రావు, లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్ ఛైర్మన్​లు ఈరవత్రి అనీల్, మానాల మోహన్​రెడ్డి, తాహెర్, అన్వేష్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.