14 ఏళ్ల తర్వాత రెట్టింపైన అగ్గిపెట్టె రేటు

14 ఏళ్ల తర్వాత రెట్టింపైన అగ్గిపెట్టె రేటు
  • 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన అగ్గిపెట్టె రేటు
  • సరుకుల ధరలు, ఖర్చులు పెరగడమే కారణం

న్యూఢిల్లీ:  దేశంలో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ పెరుగుతుందనడానికి మరొక ఉదాహరణ అగ్గిపెట్టెల ధరలు పెరగడం. గత 14 ఏళ్లుగా రేట్లు పెంచడానికి ఇష్టపడని కంపెనీలు, ఇప్పుడు వీటి ధరలను రెట్టింపు చేశాయి. అంటే  ఇప్పటి వరకు ఒక అగ్గిపెట్టె (చిన్నది) ధర రూపాయి ఉండగా, ఈ ధరను రూ. 2 కి పెంచుతూ అగ్గిపెట్టెలను తయారు చేస్తున్న కంపెనీలు నిర్ణయించుకున్నాయి. చివరి సారిగా 2007 లో అగ్గిపెట్టె ధర 50 పైసలు నుంచి రూ. 1 కి పెరిగింది. రా మెటీరియల్స్ ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో రేట్లను పెంచుతున్నామని నేషనల్ స్మాల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌బాక్స్‌‌‌‌‌‌‌‌ మానుఫాక్చరర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్  ప్రకటించింది. అగ్గిపెట్టెలను తయారు చేయడంలో మొత్తం 14 రా మెటీరియల్స్ వాడుతున్నామని ఈ అసోషియేషన్ పేర్కొంది.  రెడ్‌‌‌‌‌‌‌‌ పాస్ఫరస్‌‌‌‌‌‌‌‌ ధర కేజీ రూ. 425 నుంచి రూ. 810 కి పెరిగిందని, కేజీ వ్యాక్స్‌‌‌‌‌‌‌‌ ధర  రూ. 58 నుంచి రూ. 80 కి చేరుకుందని వివరించింది. వీటితో పాటు పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  పొటాషియం, క్లోరేట్‌‌‌‌‌‌‌‌, సల్ఫర్ వంటి రా మెటీరియల్స్ ధరలు కూడా పెరిగాయని  ఈ అసోసియేషన్ పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా ఎక్కువయ్యాయని తెలిపింది. ప్రస్తుతం 600 అగ్గిపెట్టెలు ఉన్న బాక్స్‌‌‌‌‌‌‌‌ను రూ. 270–300 కు అమ్ముతున్నామని, ఈ ధరను రూ. 430–480 కి పెంచామని ఈ అసోసియేషన్ సెక్రటరీ వీఎస్‌‌‌‌‌‌‌‌ సీతారత్నం అన్నారు. ‘ధరలను 60 శాతం  పెంచి రూ. 430–480 కి అమ్మాలని నిర్ణయించుకున్నాం. ఈ రేటులో 12 శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌టీ, రవాణా ఖర్చులు కలిసుండవు’ అని చెప్పారు. ప్రస్తుతం అగ్గిపెట్టెల ఇండస్ట్రీ  తమిళనాడులో డైరెక్ట్, ఇన్‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ఇండస్ట్రీ లేబర్ కొరత ఎదుర్కొంటోంది. చాలా మంది ఎక్కువ వేతనాలు ఇచ్చే ఉపాధి పనులవైపు షిఫ్ట్ అవుతున్నారు.