ములుగు/తాడ్వాయి : మేడారం సమ్మక్క సారలమ్మను శుక్రవారం గవర్నర్జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న ఆయనకు మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాంనాయక్, డీజీపీ శివధర్‌రెడ్డి, కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం పూజారులు డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాలతో ఆహ్వానం పలికారు. గవర్నర్తన సతీమణితో కలిసి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తులాభారం వేసి ఎత్తు బంగారం సమర్పించారు.
