ఇంటర్నెట్ సెన్సేషన్ మేజర్ రిషబ్ సింగ్: ఎవరు ఈ రియల్ హీరో ?

ఇంటర్నెట్ సెన్సేషన్ మేజర్ రిషబ్ సింగ్: ఎవరు ఈ రియల్ హీరో ?


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక ఆర్మీ ఆఫీసర్ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అతను ఎవరో కాదు మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సహాయకుడిగా (ADC - Aide-de-Camp) పనిచేస్తున్నారు, తన స్టైలిష్ లుక్స్,  క్రమశిక్షణతో అందరి మనసు గెలుచుకుంటున్నారు.

 ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడంటే 
రాష్ట్రపతి ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె వెంటే ఉంటూ, వర్షం వస్తే గొడుగు పట్టడం, ఆమెకు అవసరమైన సాయం చేయడంలో ఆయన చూపించే వినయం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆయన లుక్  పాతకాలపు సినిమాల్లోని హీరోలా ఉంటుందని, యూనిఫాంలో ఇంకా ఆకర్షణీయంగా ఉన్నాడని సోషల్  మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ఈ ఆఫీసర్‌ను చూస్తుంటే నాకూ రాష్ట్రపతి కావాలనిపిస్తోంది అని  పెట్టిన కామెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో  వైరల్  అవుతుంది.

ALSO READ : అంతరిక్షంలో AI డేటా సెంటర్లు

మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ ఒక గొప్ప వీరుడు. ఆయన ఇండియన్ ఆర్మీలో అత్యంత కఠినమైన '4 పారా స్పెషల్ ఫోర్స్'లో అధికారి. అత్యంత ప్రతిష్టాత్మకమైన బలిదాన్ బ్యాడ్జ్ అందుకున్నాడు. ఈ బ్యాడ్జ్ పొందాలంటే అసాధారణమైన శారీరక, మానసిక దృఢత్వం ఉండాలి. 2021లో రిపబ్లిక్ డే పరేడ్‌లో తన యూనిట్‌కు నాయకత్వం వహించి 'బెస్ట్ మార్చింగ్' ట్రోఫీ గెలుచుకున్నారు. 2026 వేడుకల్లో కూడా ఆయన రాష్ట్రపతి వెంటే ఉండి అందరి దృష్టిని ఆకర్షించారు.

ALSO READ : అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీంకు బీసీసీఐ క్యాష్ రివార్డ్.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

సోషల్ మీడియాలో ఆయన ముఖంలో నిజాయితీ కనిపిస్తోందిని.. రాష్ట్రపతిని ఒక కొడుకులా చూసుకుంటున్నారు అని...., ఆమె నిజంగా అదృష్టవంతురాలు అంటూ నెటిజెన్స్ ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.