సంక్రాంతి బరిలో మెగాస్టార్ 154

సంక్రాంతి బరిలో మెగాస్టార్ 154

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఖైదీ నెం.150, సైరాతో టాలీవుడ్ను షేక్ చేసిన మెగాస్టార్..రీసెంట్గా ఆచార్యతో పర్వాలేదనిపించారు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది.  దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన 154వ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే పవర్ ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో  చిరంజీవి 154వ సినిమా చేస్తున్నారు. 154వ సినిమాతో నిరుత్సాహంలో  ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇవ్వాలని మెగాస్టార్ భావిస్తున్నారు.  

తాజాగా చిరంజీవి 154వ సినిమాకు సంబంధించి  రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ 154 సినిమా విడుదల చేస్తున్నట్లు మూవీ బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్ చేసింది. 2023 సంక్రాంతికి జ‌న‌వ‌రిలో క‌లుద్దాం అంటూ కొక్కెం ప‌ట్టుకున్న  చిరంజీవి చేయి ఉన్న పోస్టర్‌ను ఖతర్నాక్ ఉంది. ఈ  పోస్టర్ ను చూస్తుంటే సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌కు కొద‌వే లేద‌నిపిస్తుంది.  ఈ అప్డేట్‌తో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మెగాస్టార్ 154 మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య  అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం   మైత్రి మూవీస్ బ్యానర్పై తెరకెక్కుతోంది.  దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రుతి హాస‌న్, మెగాస్టార్కు జోడీగా నటిస్తోంది.  ఇందులో చిరంజీవి త‌మ్ముడి పాత్రలో హీరో ర‌వితేజ క‌నిపించ‌బోతున్నారు. చిరంజీవి 154  మూవీ షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా కోసం చెన్నైలో భారీ సెట్ వేసి అక్కడ షూటింగ్ చేశారు. మ‌లేషియాలోనూ కొన్ని రోజుల పాటు షూటింగ్ జ‌రిగింది. 

ప్రస్తుతం 154వ షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి..మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. మోహ‌న్ రాజా ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న లూసిఫ‌ర్ రీమేక్‌  గాడ్‌ఫాద‌ర్ చిత్రం  సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.  అటు మెహ‌ర్ ర‌మేష్ డైరెక్షన్లో  తెరకెక్కుతున్న  భోళా శంక‌ర్ మూవీ కూడా సెట్స్పై ఉంది.