లారా 400 రికార్డ్ స్టీవ్ స్మిత్ బ్రేక్ చేస్తాడు..ఆసీస్ దిగ్గజ క్రికెటర్ జోస్యం

లారా 400 రికార్డ్ స్టీవ్ స్మిత్ బ్రేక్ చేస్తాడు..ఆసీస్ దిగ్గజ క్రికెటర్ జోస్యం

అస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ ఇటీవలే పాక్ తో సిరీస్ తర్వాత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే . దశాబ్దకాలంగా ఆసీస్ ఓపెనర్ గా కీలక ఇన్నింగ్స్ లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. తన టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ప్రస్తుతం చర్చ నెలకొంది. ఈ విషయంపై ఆసీస్ క్రికెట్ దిగ్గజం మైకేల్ క్లార్క్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరును సూచించాడు. అంతేకాదు లారా టెస్టుల్లో నెలకొల్పిన 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను స్మిత్ బ్రేక్ చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. 
               
ESPN అరౌండ్ ది వికెట్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ.. కెప్టెన్ పాట్ కమిన్స్.. స్మిత్‌కు టెస్టులో ఓపెనర్ ప్రమోట్ చేస్తానని చెప్పాడు. స్మిత్ తో గ్రీన్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని తెలియజేశాడు. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్‌గా స్మిత్‌ ఆడితే 12 నెలలో నెం.1 టెస్టు ఓపెనర్‌గా అవతరిస్తాడని కితాబులిచ్చాడు. 

విండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా టెస్టుల్లో నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత పరుగుల 400 రికార్డ్ ను స్మిత్ బ్రేక్ చేస్తాడని బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.  లారా 2004లో సెయింట్ జాన్స్‌లో ఇంగ్లండ్‌ పై ఈ చారిత్రాత్మక ఫీట్‌ని అందుకున్నాడు. విశేషం ఏమిటంటే.. లారా  ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్ మాథ్యూ హేడెన్ యొక్క 380 పరుగులను రికార్డ్ ను బ్రేక్ చేసి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా అవతరించాడు.   

స్మిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున నెంబర్ 4 లో బ్యాటింగ్ చేస్తున్నాడు. నెంబర్ 4 లో 61.51 దాదాపు 6000 పరుగులు  సాధించాడు. ఇక నెంబర్ 3 లో 67.08 సగటుతో 1744 పరుగులు చేశాడు.  5, 6, 7,8 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన స్మిత్ యావరేజ్ 45 గా ఉంది. స్మిత్ టెస్టు క్రికెట్ లో ఏ స్థానంలో ఆడినా పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ఇటీవలే టెస్టుల్లో ఓపెనర్ గా ఆడటం తనకు ఇష్టమేనని స్వయంగా తెలిపాడు. దీంతో స్మిత్  తర్వాత ఆసీస్ ఆడబోయే టెస్ట్ సిరీస్ లో ఓపెనర్ గా రావడం దాదాపు ఖాయమైంది.