వర్క్ ఫ్రమ్ హోంకి మైక్రోసాఫ్ట్ బై బై.. ఇకపై వారానికి 3 రోజులు ఆఫీసుకి తప్పనిసరి..

వర్క్ ఫ్రమ్ హోంకి మైక్రోసాఫ్ట్ బై బై.. ఇకపై వారానికి 3 రోజులు ఆఫీసుకి తప్పనిసరి..

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్  వర్క్-ఫ్రమ్-హోమ్ (WFH) విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దింతో 2026 ఫిబ్రవరి నుండి వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్ హెడ్ ఆఫీసుకి 50 మైళ్ల దూరంలో ఉండే ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి ఉంటుంది. 

2020 COVID-19 సమయంలో మైక్రోసాఫ్ట్ రిమోట్-వర్క్ విధానాన్ని ప్రవేశపెట్టింది, దింతో ఉద్యోగులు ఇంటి నుండి పని చేయగలిగారు. అయితే, కంపెనీ ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ తప్పనిసరి చేసింది. దీని వల్ల ఆఫీస్ కల్చర్లో మళ్ళీ పెద్ద మార్పు వస్తుంది. అయితే ఈ కొత్త విధానం దశలవారీగా అమలు చేయనుంది. 

మొదట రెడ్‌మండ్ ఆఫీసుకి 50 మైళ్ల దూరంలో ఉన్న ఉద్యోగులు ఫిబ్రవరి 2026 నుండి వారానికి 3 రోజులు ఆఫీసుకి రావాలి. తరువాత ఇతర US ఆఫీసులకి ఈ విధానం వర్తిస్తుంది. తరువాత భారతదేశంతో సహా అంతర్జాతీయ ఆఫీసులకి ఈ విధానం అమలవుతుంది. మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మన్ మాట్లాడుతూ ఉద్యోగులు ఈ మార్పుకు రెడీ కావడానికి తగినంత సమయం దొరుకుతుందని అన్నారు.

►ALSO READ | బ్యాంక్ అకౌంట్లో కోట్లలో క్యాష్.. సంపదతో సంతోషానికి గ్యారెంటీ లేదంటున్న టెక్కీ

కరోన కారణంగానే ఈ రిమోట్ వర్కింగ్‌ కల్చర్ వచ్చింది, కానీ ప్రపంచ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసులకి తిరిగి రావాలని ప్రోత్సహిస్తున్నాయి. అమెజాన్ కూడా ఉద్యోగులకు 5 రోజుల ఆఫీస్ తప్పనిసరి చేసింది. అంతేకాదు మెటా, గూగుల్, జెపి మోర్గాన్, విప్రో, WFH విధానాలను వెనక్కి తీసుకున్నాయి.

ఈ కొత్త రూల్  మొదట USలో వర్తిస్తుండగా తరువాత బెంగళూరు, హైదరాబాద్ ఇతర ప్రదేశాలలోని మైక్రోసాఫ్ట్ ఇండియా ఆఫీసులకి వర్తించే అవకాశం ఉంది.