- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మారం, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన వడ్లను కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. సన్న వడ్ల కొనుగోలు కూడా జరుగుతుందని, రైతులకు ప్రభుత్వం బోనస్ అందజేస్తుందని పేర్కొన్నారు. వడ్ల తరలింపులో మిల్లర్లతో మాట్లాడే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ వెంకట రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు మహిపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
