కాంగ్రెస్ ఫ్లెక్సీలో మంత్రి హరీష్ రావు ఫోటో..ఎక్కడో కొడుతుంది సీనా..

కాంగ్రెస్ ఫ్లెక్సీలో మంత్రి హరీష్ రావు ఫోటో..ఎక్కడో కొడుతుంది సీనా..

రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అక్కడి కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో స్థానిక కాంగ్రెస్ లీడర్లు మంంత్రి హరీష్ రావు ఫోటో వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో సోషల్ మీడియాతో పాటు..తెలంగాణ రాజకీయ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు ఆగస్టు 17వ తేదీన పర్యటించారు. ఇందులో భాగంగా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకర్ ప్రారంభంతో పాటు..మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో టీపీసీసీ సభ్యులు,  తుర్కయాంజల్ 18వ వార్డు కౌన్సిలర్ కాకుమాను సనీల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ్ల్లో మంత్రి హరీష్ రావు ఫోటోను వేశారు. మంత్రి హరీష్ రావుతో పాటు...కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి, తుర్కయాంజల్ మున్సిపల్ చైర్మన మల్ రెడ్డి అనురాధా రెడ్డి, రాంరెడ్డి, తుర్కయాంజల్ వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ ఫోటోలను కూడా ఫ్లెక్సీలు వేశారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

కాంగ్రెస్ ఫ్లెక్సీ్ల్లో మంత్రి హరీష్ రావు ఫోటో కనిపించడంతో స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ లీడర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇదేంటి కాంగ్రెస్ ఫ్లెక్సీ్ల్లో మంత్రి హరీష్ రావు ఫోటో వేయడమేంటని అవాక్కవుతున్నారు.