కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు

కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు

ఖమ్మం: రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త... ఇవాళ కరెంట్ పోతే వార్త అని కేటీఆర్ అన్నారు. శనివారం జిల్లాలో   కలిసి పువ్వాడతో కలిసి కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.  ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన‌, మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌, ప్రకృతి వ‌నాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు గుర్తొస్తాయన్నారు. మంత్రి పువ్వాడ అజయ్జిల్లాను బాగా అభివృద్ధి చేస్తున్నారన్న ఆయన... టీఆర్ఎస్ పాలనలో ఎర్ర జెండా పార్టీల అవసరం లేకుండా పోయిందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా ఎదగాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, దేశంలో ఇవాళ  ముస్లింలు రోడ్డు మీదకు వచ్చిఎందుకు నిరసనలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు.

తెలంగాణ మీద బండి సంజయ్ కు ప్రేమ ఉంటే మసీదుల గురించి కొట్లాడటం కాదు... దమ్ముంటే కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. కులకోటటం కాదు, బీడు భూములు సాగులోకి తీసుకొని రావాలి. రాష్ట్ర ప్రజలు చెల్లించిన పన్నులతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకుంటున్నారే తప్ప రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వడంలేదని విమర్శించారు. ఇక ఒక్క ఛాన్స్ అంటూ కొంతమంది డ్రామాలాడుతున్నారని, గతంలో 50 ఏళ్లు అధికారమిస్తే ఏం చేశారని కాంగ్రెస్ పై  మండిపడ్డారు. అప్పుడు కరెంట్, నీళ్లు ఇవ్వని వాళ్లు ఇప్పుడు ఇస్తారా అని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే లవంగం ఇస్తారే తప్ప అధికారం ఇవ్వరని బండి సంజయ్ ను ఎద్దేవా చేశారు.  సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా టీఆర్ఎస్ ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు.