యూరియా ఇవ్వకపోతే సారీ చెప్పండి : మంత్రి పొన్నం

యూరియా ఇవ్వకపోతే సారీ చెప్పండి : మంత్రి పొన్నం
  • కేంద్ర ప్రభుత్వానికి మంత్రి పొన్నం డిమాండ్‌‌‌‌

భీమదేవరపల్లి, వెలుగు: రైతులకు ఎరువులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటే.. మరోవైపు, అన్నదాతలను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అవసరం మేరకు యూరియా ఇవ్వాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పనుల జాతర- 2025’లో భాగంగా శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారంలో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేసి, వీర్లగడ్డా తండా గ్రామ పంచాయతీ బిల్డింగ్‌‌‌‌ను ప్రారంభించారు.

 అంతకుముందు కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. గ్రామాల్లోని ఏండ్లుగా ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే పనుల జాతరకు శ్రీకారం చుట్టామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలిపారు.