యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి. ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బంది పైన తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ మహాకుంభ సంప్రోక్షణ పూజాకార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రాథమిక చికిత్స కొరకు పూజా క్రతువును ముగించుకున్న తర్వాత మంత్రి అజయ్ హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు.
