కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే : మంత్రి వివేక్

కలిసికట్టుగా పనిచేస్తే  విజయం మనదే : మంత్రి వివేక్
  • జూబ్లీహిల్స్ సెగ్మెంట్​ను బీఆర్ఎస్ పట్టించుకోలేదు: మంత్రి వివేక్
  • బోరబండలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్ బోరబండ డివిజన్​లో స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి రూ.1.50 కోట్లతో సీసీ రోడ్ల మరమ్మతు పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మాకు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. బోరబండ డివిజన్​లో ఇటీవల ప్రారంభించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇకపై బోరబండలో మౌలిక వసతులు మెరుగుపడతాయి’’అని మంత్రి వివేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ బాబు, రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ చైర్​పర్సన్ బండ్రు శోభారాణి, కాంగ్రెస్ లీడర్లు కాసుల మహేశ్ గౌడ్, శివ కుమార్ గుప్తా, ఆనంద్, ఇదాయత్, ఖలీల్, సుధాకర్ రెడ్డి, భూపతిరెడ్డి, బబ్లు గౌడ్ రజ్వి, యూనుస్, కవిత, లక్ష్మినాయక్, అలివేలు, శంకర్, భరత్, భాగ్యలక్ష్మి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.